తండేల్‌.. కీలక షెడ్యూల్‌ పూర్తి

తండేల్‌.. కీలక షెడ్యూల్‌ పూర్తినాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘తండేల్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాలో కీలకంగా సాగే సుదీర్ఘ షెడ్యూల్‌ని చిత్ర బృందం పూర్తి చేసింది.
ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరీంచారు. ఈ సందర్భంగా మేకర్స్‌ కొన్ని వర్కింగ్‌ స్టిల్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీస్తున్నారని వర్కింగ్‌ స్టిల్స్‌ చూస్తే అది అర్థమవుతోంది. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్‌లో చిత్రాన్ని షూట్‌ చేస్తున్నారు.