తంగలాన్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తంగలాన్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌విక్రమ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’. ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. పా రంజిత్‌ దర్శకత్వంలో నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ‘మనకి మనకి..’ లిరికల్‌ సాంగ్‌ కూడా ఛాట్‌ బస్టర్‌ అయ్యింది. రిలీజ్‌ చేసిన ప్రతి కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ మూవీ మీద ఉన్న క్రేజ్‌ మరింత పెరుగుతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కచ్చితంగా కలిగిస్తుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.