విక్రమ్ విలక్షణ నటనకు చిరునామా. ఆయన నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి తదితన చిత్రాలెన్నో నటుడిగా ఆయన ప్రత్యేకతను చూపించాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరించే ఆయన ‘తంగలాన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించారు.
నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (గురువారం) వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో విక్రమ్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి మూవీస్ లాగే తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. ఇదొక ఎమోషనల్ మూవీ. రా కంటెంట్‌తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. పాటలు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా పా.రంజిత్ డిజైన్ చేయలేదు. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీిరియన్స్.
నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. ఇంత కష్టపడి చేయలేదు. దానికి కారణం..మా డైరెక్టర్ పా.రంజిత్. ఆయన నా దగ్గరకు ఒక కమర్షియల్ కథ తీసుకురాలేదు. పా.రంజిత్ కెరీర్‌లో కమర్షియల్ మూవీస్‌తో పాటు ఆర్టిస్టిక్ మూవీస్ చేస్తూ బ్యాలెన్స్‌గా కెరీర్ సాగిస్తున్నారు. తన సినిమాలతోనే దర్శకుడిగా ఆయన ఐడియాలజీ, స్పెషాలిటీ చూపించారు. పా.రంజిత్ చేసిన గొప్ప సినిమాల్లో తంగలాన్ ఒకటి అవుతుంది.
ప్రేక్షకుల్ని తంగలాన్ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానవేల్ నాకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ. ఇందులో రెండు క్యారెక్టర్స్ చేశాను. క్యారెక్టర్స్‌లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను.
ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ తన ఆర్ట్ ఫామ్‌లో అందంగా రూపొందించాడు. మీకు సర్‌ప్రైజ్‌గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది పాన్ ఇండియా కాదు వరల్డ్ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానవేల్ రాజా.మీరు థియేటర్స్‌కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్‌తో కనెక్ట్ అవుతారు.