తన్మరు అగర్వాల్‌ సెంచరీ

తన్మరు అగర్వాల్‌ సెంచరీ– సిక్కిం తొలి ఇన్నింగ్స్‌ 79/10
హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో హైదరాబాద్‌ హవా కొనసాగుతుంది. సిక్కింతో మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు ఆటలో తొలుత సిక్కింను 27.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చిన హైదరాబాద్‌.. బ్యాట్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 381/3 పరుగుల భారీ స్కోరు చేసింది. తనరు త్యాగరాజన్‌ (6/25), చామ మిలింద్‌ (4/30) వికెట్ల జాతర చేశారు. తన్మరు అగర్వాల్‌ (137) సెంచరీతో చెలరేగగా.. రాహుల్‌ సింగ్‌ (83), రోహిత్‌ రాయుడు (75), తిలక్‌ వర్మ (70 నాటౌట్‌) అర్థ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌తో నేడే సిక్కింపై నెగ్గేందుకు హైదరాబాద్‌ దూకుడు ప్రదర్శించనుంది!.