
స్థానిక మారుతినగర్తిని స్నేహ సొసైటి ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో తన్నీరు గోపాల కృష్ణ జన్మదిన వేడుకలను ఆయన తల్లి దండ్రులు సుబ్బారావు, రాజ్యలక్ష్మీలు దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిదిగా లయన్క్లబ్ ఆఫ్, బోధన్ అయ్యప్ప సేవా అధ్యక్షురాలు ఎల్ ఎన్ కొత్తపల్లి జీవిత, కోశాధికారి సూరా బత్తుని అంథోని మేరి, డిస్ట్రిక్ సెక్రటరీ సూరాబత్తుని శ్రీనివాసరావ్ లయన్స్ క్లబ్ సభ్యులు మంజూష, మమత, రామాదేవి దశరధులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమములో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ యస్. జ్యోతి, వైన్. ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మానసిక వికలాంగ విద్యార్థులు, అంధ విద్యార్థులు సిబ్బంది పాల్గోన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు.