తండ్రి గెలుపు కోసం తనయ ప్రచారం

నవతెలంగాణ- నకిరేకల్
ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆదివారం మండలంలోని మోదిని గూడెం గ్రామంలో చిరుమర్తి లింగయ్య కూతురు మానస ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ యూత్  అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్ , గ్రామశాఖ అధ్యక్షుడు వలిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చిమట పవన్, యాదవ సంగం ఉపాధ్యక్షుడు పగడాల పుల్లయ్య , వార్డ్ మెంబర్లు వలిశెట్టి రేణుక, కుర్ర సైదులు, యాదవ సంగం మెంబర్  కుర్ర సంతోష్ , సీనియర్ నాయకులు  పేర్ల ఎల్లయ్య, కుర్ర సైదులు, వలిశెట్టి నాగరాజు, బరిశెట్టి నాగరాజు, వలిశెట్టి మహేష్, కుర్ర సైదులు, ముడి విజేందర్, కుర్ర జానయ్య, బండారు దానెలు పాల్గొన్నారు.