తారకాసుర 2 మొదలైంది

కన్నడలో ఘనవిజయం సాధించిన ‘తారకాసుర’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే, ఆ చిత్రానికి సీక్వెల్‌గా స్ట్రెయిట్‌ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీజ మూవీస్‌ పతాకంపై విజరు భాస్కర్‌ రెడ్డి పాల్యం దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా, నిర్మాతగా ‘తారకాసుర -2′ చిత్రం పటాన్‌ చెరులోని జైపాల్‌ ముదిరాజ్‌ ఫామ్‌ హౌస్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ముఖ్య పాత్రధారి విజరు భాస్కర్‌ రెడ్డిపై పటాన్‌ చెరు ఎమ్‌.ఎల్‌.ఎ.మహీపాల్‌ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, జైపాల్‌ ముదిరాజ్‌ క్లాప్‌ కొట్టారు. పటాన్‌ చెరువు కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ యాదవ్‌ గౌరవ దర్శకత్వం వహించారు.
”తారకాసుర’ సిరీస్‌తో విజరు భాస్కర్‌ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు.
టెన్నిస్‌ ప్లేయర్‌గా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా, ఒక బ్యాంక్‌ వ్యవస్థాపకునిగా విజరు భాస్కర్‌ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని అభిలషించారు.
కార్టూనిస్ట్‌ మల్లిక్‌, నటులు హేమ సుందర్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.