నవతెలంగాణ-రామగిరి : కార్పొరేట్ టార్గెట్ కమిటీ అధికారులు జిఎంలు సిపిపి జక్కం రమేష్, డి.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, సర్వే పి.ఎస్.కే. రవి ,ఏజీఎం, ఐఈ బి.రవి లతోపాటు ఇతర కమిటీ సభ్యులు ఆర్జీ-3 జిఎం ఎన్ సుధాకర రావు, ఏపీఏ జిఎం కే. వెంకటేశ్వర్లు తో పాటు వివిధ విభాగాల అధికారులతో 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సాధించాల్సిన వార్షిక ప్రణాళిక, వార్షిక బొగ్గు ఉత్పత్తి, ఉపరితల గనులలో మట్టి వెలికితీత మొదలగు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయా భూగర్భ, ఉపరితల గనులకు కావలసిన యంత్రాలు, యంత్ర సామాగ్రి, పనిముట్లు, కావలసిన సదుపాయాలు అంశాల గురించి చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు… బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్లు పి ఎలీషా, సీతారామం, ఎస్ ఓ టు జిఎంలు డి.బైద్య, జి రఘుపతి, ప్రాజెక్ట్ అధికారులు ఎన్ రాధాకృష్ణ, కె నాగేశ్వరరావు, కె రాజేందర్, ఏరియా సర్వే అధికారి జైనుల బద్దీన్, ఏరియా భద్రత అధికారి సిహెచ్* వెంకటరమణ, డీజీఎం, ఐఈడి కె చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఆర్ శ్రీనివాస్, ఎం నాగరాజు, సిహెచ్ పి డీజీఎం కాశీ విశ్వేశ్వర రావు లతోపాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.