
నల్గొండ జిల్లా పెద్దవూర మండల ఎంఈఓ గా తరి రాము శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గత ఐదేళ్లుగా మండలం లో పర్మినెంట్ ఎంఈఓ లేక ఇంచార్జిలే పర్యవేక్షణ చేశారు. ఇంతకు ముందున్ను ఎంఈఓ బాలు నాయక్ పెద్దవూర ఇంచార్జి గా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఈఓ తరి రాము పీఏపల్లి, గుర్రంపూడ్, తిరుమలగిరి సాగర్, మండలాలకు ఇంచార్జి వ్యవహారించారు. ఇప్పుడు పెద్దవూర పర్మినెంట్ ఎంఈఓ గా శుక్రవారం బాధ్యతలు స్వీక రించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షిస్తానాని అన్నారు.మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నాణ్యతతో పాటు, వేగవంతంగా జరిగేలా, చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా మండలంలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని మరియు విద్యార్థులలో పోషకాహార లోపాన్ని తగ్గించి, నాణ్యమైన ఆహారాన్ని వారికి అందేలా ప్రభుత్వం చేపడుతున్న మెనూ ప్రకారం సక్రమంగా అందేలా చూస్తానని ఆయన ఈ సంధర్భంగా తెలియజేశారు.విద్యావ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రభుత్వం చేపట్టే ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచేలా తన వంతుగా కృషి చేస్తానని వారు తెలిపారు. ఎక్కడ ఎటువంటి డ్రాప్ అవుట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులను సిబ్బందిని కలుపుకుంటూ విద్యాభివృద్ధికి పాటుపడతారని తెలిపారు.అనంతరం ఉపాధ్యాయులు,విద్యార్థి సంఘాల నాయకులు ఎంఈఓ ను ఘన సన్మానం చేశారు.