ముందుకా, వెనుకకా?
నేను ముందుకు కదిలానా,
లేక వెనుకనే ఉండిపోయానా? చెప్పడం కష్టం!
మనుషుల ప్రధాన స్రవంతిలోంచి
విడివడ్డానని మాత్రమే తెలుసు నాకు
నేను ముందు ఉన్నానా ేక వెనుక ఉన్నానా అనేదాన్ని
పైనుంచి చూస్తున్న వ్యక్తి చెప్పగలడు బహుశా
ఒకవేళ అతనూ నేనూ కలుసుకుంటే.
ఎప్పుడో ఒకసారి నేనక్కడికి చేరుకుంటానేమో,
అప్పుడు ఇక్కడి దృశ్యం కనిపించవచ్చు
నేను ముందు ఉన్నానా వెనుక ఉన్నానా
అనేదాన్ని నిర్ధారించుకునే అవసరముండదు అప్పుడు
మరాఠీ మూలం: ప్రఫుల్ శిలేదార్
ఆంగ్లానువాదం: మాయా పండిట్
తెలుగు సేత: ఎలనాగ