మనుషులకు మాత్రమే పాటలుంటాయి
పాటలు పైరగాలి మీది పరిమళంగా మారే
కాలం ఒకటుంటుంది ఏడాదిలో.
గాలిని తరుముతూ గగనాన్ని చేజిక్కించుకో
పిట్టల కిలకిలారావాలకు పువ్వులు విచ్చుకుంటాయి
చిన్నపిల్లల ప్రశ్నలు సాయంత్రాల గడపలమీద
గుమిగూడుతాయి
ఆ పాటల్లోంచి పాతరక్తం ఒలుకుతుంది
చేపలు వెచ్చని ఇసుకతీరాల మీదికి ఎగురుతై
నెత్తురు వాయువు మీది వాసనగా మారే
కాలం ఒకటుంటుంది ఏడాదిలో
అస్సామీ మూలం: నీలమణి ఫూకన్
ఆంగ్లానువాదం: అనిందితా కర్
తెలుగు సేత: ఎలనాగ
బొహాగ్: అస్సామీయుల సంవత్సరంలోని మొదటి నెల పేరు. ఇది బెంగాలీల బొయిసాఖ్ కు సమానం. ఈ నెలలో వసంతం, దాని ఉత్సవాలు మొదలౌతాయి. బిహు అన్నది మరింత కచ్ఛితమైన పదం.