రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టార్పాలిన్లు అందజేత..

నవతెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం భారీ వర్షాల వల్ల పూరి గుడిసెలకు, ఇండ్లకు టార్పాలిన్లను రెడ్ క్రాస్ మండల అధ్యక్షుడు వైద్యులు లింబాద్రి, స్థానిక సర్పంచ్ దండబోయిన సంజీవ్ తదితరులు ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, గ్రామస్తులు రాజిరెడ్డి, భూపతి శ్రీనివాస్, బండి ప్రవీణ్, బండ కింది రమేష్ తదితరులు పాల్గొన్నారు.