మరో భిన్న చిత్రంలో తరుణ్‌ భాస్కర్‌

మరో భిన్న చిత్రంలో తరుణ్‌ భాస్కర్‌యారో సినిమాస్‌, డోలాముఖి సబ్‌బల్ట్రాన్‌ ఫిల్మ్స్‌ తమ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాయి. ఇది రెండు నిర్మాణ సంస్థలకు సెకండ్‌ ప్రొడక్షన్‌ వెంచర్‌. తరుణ్‌ భాస్కర్‌ లీడ్‌ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాతో వంశీరెడ్డి దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రౖటర్‌, డైరెక్టర్‌ వేణు ఊడుగుల అడిషినల్‌ కంట్రిబ్యూషన్‌తో బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ గౌడ్‌ అనే పాత్రను అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకున్నట్లు సూచించే స్టాంప్‌ పేపర్‌తో యూనిక్‌ స్టయిల్‌లో ఈ సినిమాని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కొత్త టాలెంట్‌ని డిస్కవర్‌ చేయడానికి నటీనటుల కోసం టీమ్‌ ఓపెన్‌ కాస్టింగ్‌ కాల్‌ని కూడా అనౌన్స్‌ చేసింది.