తరుణ్ మృతి బాధాకరం : దనసరి సూర్య

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని మోట్లగూడెం గ్రామానికి చెందిన తరుణ్ రహదారి ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అని ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క కుమారుడు సూర్య అన్నారు. శుక్రవారం మోట్లగూడెం గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కురుసం కన్నయ్య సోదరుని కుమారుడు కురుసం తరుణ్ ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందగా తరుణ్ కుటుంబాన్ని సూర్య పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం తరుణ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే తరుణ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సర్పంచ్ సనప సమ్మయ్య తో పాటు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు, ప్రజలు పాల్గొన్నారు.