గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

– 900 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం
నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలం బేగంపేట గ్రామ శివారులో గుడుంబా తయారీ బట్టిలపై శుక్రవారం రామగుండం కమిషనరేట్ ఏరియా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఆదేశాలతో సీఐ రమేష్ బాబు, ఎస్సైలు కటికే రవి ప్రసాద్, రాజేష్ ఆధ్వర్యంలో 900 లీటర్ల గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేశారు. నమ్మదగిన నమాచారంతో బేగంపేట్ పంచాయతీ పరిధి స్టోన్ క్రషర్ ఏరియాల గుట్టలలో గుడుంబా బట్టిలను ఏర్పాటు చేశారని అందిన నమ్మదగిన నమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా గుడుంబా తయారు కేంద్రాలను గుర్తించి బెల్లం పానకాన్ని ధ్వంనం చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన గుడుంబా తయారీదారులు పారిపోయారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ సంగం రాజేందర్, శ్రీనివాస్, మల్లేష్, మహేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.