ఫతేపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

నవతెలంగాణ-ఆర్మూర్ 

మండలంలోని ఫతేపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని జిల్లా టాస్క్ఫోర్స్ సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించినారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 26వేల 900 రూపాయలు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని స్థానిక ఎస్సై గంగాధర్ కు అప్పగించారు. ఎనిమిది మందిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసినారు..