భీంగల్ లో టాస్క్ ఫోర్స్ దాడులు

– 60  క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం పట్టివేత
నవతెలంగాణ- భీంగల్
భీంగల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం టాస్క్ ఫోర్స్ ఏసిపి   రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సిఐలు  అజయ్, అంజయ్య  దాడులు  నిర్వహించి  పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. భీంగల్ పట్టణ పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించగా పట్టణ కేంద్రంలో  బాపూజీ నగర్ కాలనీకి చెందిన సలావుద్దీన్ అనే వ్యక్తి  వద్ద 60  క్వింటాల్ పిడిఎస్ బియ్యాన్ని  పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకొని సలావుద్దీన్ పై కేసు నమోదు చేసినట్లు భీంగల్ ఎస్సై హరిబాబు తెలిపారు.