
నవతెలంగాణ -తాడ్వాయి
ఆసియా ఖండంలోని అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మినీ మేడారం జాతరలో, పీసా కమిటీ తీర్మానం లేకుండానే పనులు నిర్వహిస్తున్నారని మేడారం మాజీ సర్పంచ్ గడ్డం సంధ్యారాణి విమర్శించారు. మేడారం పూర్తిగా 5వ షెడ్యూల్ ప్రాంతమని, ఈ ప్రాంతంలో 1/70, పీసా చట్టాల తీర్మానాల మేరకే అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. కానీ పిసా కమిటీ కి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా అవి అక్రమార్కులకు చుట్టాలుగా మారాయి తప్ప, గిరిజనులకు ఎటువంటి మేలు జరగలేదన్నారు.