టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ వంటల పోటీలు

Tasty Telangana Treats Nizamabad Cooking Competitions– 18-32 ఏళ్ల యువతులకు సువర్ణావకాశం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ వంటల పోటీలు నిర్వహించనున్నామని, జిల్లా లోని మహిళలను,యువతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంలో ఏర్పాటు చేశామని ఇన్ఫినిటీ కళాశాల హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రత్నాకర్ పేడూరి అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాధురి, అక్షర లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాకర్ పేడూరి మాట్లాడుతూ.. 18 నుంచి 32 సంవత్సరాల యువతులకు వంటల పోటీలు తెలంగాణ ఛెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ – 2024 వంటల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలోని ఫుడ్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళలు వంటలు చేసి పేరు సంపాదించాలని, వంటలు చేసి  మెప్పించాలని సమయం కోసం వేచి చూస్తున్న వారి కోసమే ఈ కార్యక్రమం అని అన్నారు. పోటీలో పాల్గొనే వారికి ఉచిత ఎంట్రీ ఉంటుందని, వారు చేసే వంటకాల సామగ్రి తెచ్చుకోవాలని అన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించనున్నామని వారిని హైదారబాద్ లో జరిగే ఫైనల్  పోటీలకు పంపనున్నామని, సెలబ్రెటీ చెఫ్స్ గా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బెస్ట్ ఛెఫ్స్ హాజరుకానున్నారని అన్నారు. ఇతర వివరాలకు నేరుగా ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలలో గాని  81061 82233 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.