– టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.1కోటి 95లక్షల విలువైన చెక్కులు అందజేత
– ఆత్మహత్య, విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారికి పరిహారం
– ప్రతి పౌరుడికి జీవిత భీమా కల్పించాలన్నదే లక్ష్యం
– సీనియర్ బ్రాంచి మేనేజర్ రామకృష్ణారెడ్డి
– సంకల్ప యాత్ర పేరుతో బీమాపై అవగాహన
నవతెలంగాణ – కరీంనగర్ :
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచి ఒకే రోజు రెండు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించింది. కరీంనగర్ పట్టణం కోతి రాంపూర్‌కు చెందిన గూడ సతీష్ రెడ్డి (39) ఆత్మహత్య చేసుకోగా, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజిపేటకు చెందిన అరిసెల వెంకటేశం (35) విద్యుత్ ప్రమాదంలో మరణించారు. ఇద్దరి కుటుంబాలకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శనివారం సీనియర్ బ్రాంచి మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా రూ.1కోటి 95లక్షల బీమా చెక్కులు అందించింది.
సతీష్ రెడ్డి నాలుగు సంవత్సరాల కిందట రూ.కోటి టర్మ్ పాలసీ తీసుకోగా, వెంకటేశం రెండేండ్ల కిందట రూ.50 లక్షల టర్మ్ పాలసీతో పాటు రూ.45 లక్షల ప్రమాద బీమా తీసుకున్నారు. ఇద్దరికీ భార్యలు, పిల్లలు ఉన్నారు. టాటా ఏఐఏ సంస్థ సతీష్ రెడ్డి భార్య గూడ ఆమనికీ కోటి రూపాయల చెక్కును, వెంకటేశం భార్య అరిసెల సరితకు రూ.95 లక్షల చెక్కును వారి నివాసాలకు వెళ్లి బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం అందించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి కుటుంబ పెద్ద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి భారత పౌరుడికి ఇన్షూరెన్స్ ద్వారా ఆర్థిక భద్రత కల్పించాలనేదే లక్ష్యంగా సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25న గోదావరిఖనిలో సంకల్ప్ యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. అంతేకాకుండా రతన్ టాటా జయంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలైన అనాథ ఆశ్రమంలో పిల్లలకు దుప్పట్ల పంపిణీ, వృద్ధాశ్రమం, ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం వంటి కార్యకలాపాలను గుర్తు చేశారు.
టాటా ఏఐఏ సంస్థ ప్రతి కుటుంబానికి జీవిత బీమా ద్వారా ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. ఇన్స్యూరెన్స్ మరియు క్లెయిమ్ విషయంలో అపోహలు నమ్మవద్దని, నమ్మకమైన కంపెనీ నుండి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో అసిస్టెంట్ మేనేజర్ ఆదర్శ్ కుమార్, వీరస్వామి, చంద్రశేఖర్, బ్రాంచ్ ప్రతినిధులు గోపు బాపురెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న టాటా ఏఐఏ సంస్థకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి కుటుంబానికి జీవిత బీమాతో ధీమా కల్పించాలన్నదే లక్ష్యం :
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ పార్టనర్ మల్లారపు పుష్ప మాట్లాడుతూ, “కుటుంబ ఆర్థిక భద్రతను తక్కువ ప్రీమియంతో అందించే పాలసీలు టాటా ఏఐఏ ప్రత్యేకత,” అని అన్నారు. “ఏజెంట్ల నియామకంతో పాటు, కొత్త పాలసీలు తీసుకునే వారికి సంపూర్ణ సహాయం అందిస్తున్నాం. జీవిత బీమా ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాం,” అని తెలిపారు.
వివరాల కోసం 9491679493 ద్వారా సంప్రదించాలని కోరారు.
ఏజెంట్గా జాయిన్ అయ్యేందుకు
– ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేరాలనుకునే వారు కింది లింకు ద్వారా
https://mallarapupushpa.tataaiapartner.com?tid=ahg0r పేరు నమోదు చేసుకోవచ్చు.
టర్మ్ పాలసీ కోసం :
కనీసం కోటి రూపాయల బీమా రక్షణతో పాటు 10 కోట్ల వరకు డబ్బులను తిరిగి ఇచ్చే టర్మ్ మరియు వెల్త్ పాలసీ కోసం
https://mallarapupushpa.tataaiapartner.com?tid=asc64 చూస్తున్నవారు ఈ లింకు ద్వారా సరైన బీమా పాలసీని ఎంచుకోవచ్చు.