టాటా ఎఐఎ వినూత్న డిజిటల్‌ ప్రచారం

ముంబయి: ప్రయివేటు రంగం లోని జీవిత బీమా సంస్థ టాటా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఎఐఎ) వినూత్న డిజిటల్‌ ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొ ంది. తమ పిల్లల కలలను నిజం చేయడానికి తండ్రులు పడే కష్టాన్ని ‘జాదూ పాకెట్‌ కా సీక్రెట్‌’ (మ్యాజిక్‌ పాకెట్‌ రహస్యం) పేరుతో నూతన క్యాంపెయిన్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. నటుడు రజత్‌ కపూర్‌తో రూపొందించిన ఈ చిత్రంలో టాటా ఎఐఎ ఫార్చ్యూన్‌ గ్యారెంటీ ప్లస్‌ సేవింగ్స్‌ ప్లాన్‌కు ప్రచారం కల్పించ నున్నారని తెలిపింది. ఈ పాలసీ వ్యవధిలో గ్యారంటీ రెగ్యులర్‌ ఆదాయాన్ని అందిస్తుందని వెల్లడించింది.