టాప్‌ బ్రాండ్‌గా టాటా గ్రూపు

తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్‌, ఎల్‌ఐసీ
బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో బ్రాండ్‌ విలువ పరంగా 26.38 బిలియన్‌ డాలర్లతో టాటా గ్రూపు అగ్రస్థానంలో ఉందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా వెల్లడించింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ రూపొందించిన 2023 టాప్‌ 100 బ్రాండ్స్‌లో టాటా గ్రూపు తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్‌, ఎల్‌ఐసీలు నిలిచాయి. 2022తో పోలిస్తే 2023లో టాటా గ్రూపు విలువ 10.3 శాతం పెరిగిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సావియో డి సౌజ తెలిపారు. గ్లోబల్‌ 500 ర్యాంక్‌ల్లోనూ టాటా గ్రూపు ఒక్కటే టాప్‌ 100లో చోటు దక్కించుకుంది. దేశీయంగా ఇన్ఫోసిస్‌ 13 బిలియన్‌ డాలర్ల విలువతో రెండో ర్యాంక్‌లో, 9.7 బిలియన్‌ డాలర్లతో ఎల్‌ఐసీ సంస్థ మూడో స్థానంలో నిలిచింది.