పన్నుల వసూలు వేగవంతం చేయాలి

Tax collection should be expedited– భూపాలపల్లి డిఎల్పీఓ విరభద్రయ్య

నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాల్లో ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలని, ఈనెల చివరి నాటికి 50శాతం పన్నులు వసూలు చేయాలని డీఎల్ పీఓ వీరభద్రయ్య పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. మండలంలో మల్లారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పం చాయతీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా డీఎల్పీఓ మాట్లాడారు ఇంటి పన్నులు డిసెంబర్ నాటికి 100శాతం పూర్తి చేయాలని కార్యదర్శి రాజుకు సూచించారు. విద్యుత్ స్థంభాలకు వీధి దీపాలను దీపావళీ నాటికి పూర్తి స్థాయిలో అమర్చాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధవహించి, ఎక్కడా మురుగునీరు నిల్వకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై అలసత్వం వహిస్తే ఉపేక్షింది లేదన్నారు.