
రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీ ఇంకా నిర్ణయం కాలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేదన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాల కెసిఆర్ నియంత పాలన అంతం చేయడంలో టిడిపి కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు .ఏపీ లో జగన్ మళ్ళీ గెలుస్తాడని కెసిఆర్ మాట్లాడడం, టిడిపి పై ఉన్న అక్కసు మరోసారి బయటపడింది అన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన కెసిఆర్ కు బుద్ధి రాలేదు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదు అన్నారు. టిడిపి అధికారం కోల్పోయి 20 సంవత్సరాలైనా తెలంగాణలో బలమైన క్యాడర్ ఉందని.. బిఆర్ఎస్ అధికారం కోల్పోయి రోజులు గడవక ముందుకే ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలు అయినా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ ..మూడు నెలలకే రైతు రుణమాఫీ చేయలేదని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన విధానంపై పార్టీ నాయకులతో కలిసి చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శిమక్కెన అప్పారావు,అధికార ప్రతినిధి ఎండీ షరీఫ్, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రజెల్ల లింగయ్య,బడుగు లక్ష్మయ్య,ఏర్పుల సుదర్శన్,దోమల వెంకన్న,నెట్టు శ్రీకాంత్,నాయకులు గంట అంజయ్య,పొడుపంగి సైదులు,అవ్వారి సుబ్బారావు,పుప్పాల యాదయ్య, తోకల యాదయ్య, మారగోని పాపయ్య,నల్ల పర్వతాలు,మారుగోని అశోక్ వర్కాల వెంకటేశం,తడక కోటేశ్వర్, చిన్న బిక్షం తదితరులు పాల్గొన్నారు.