బాబుకు బెయిల్ రావడంతో టీడీపీ నాయకుల సంబరాలు..

నవతెలంగాణ-పెన్ పహాడ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బెయిల్ మంజూరు అవడంతో టిడిపి నాయకులు బుధవారం మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మండల టీడీపీ అధ్యక్షులు శెట్టిపల్లి సైదులు మాట్లాడుతూ అక్రమ కేసుల్లో ఇరికించి బాబును జైల్లో పెట్టారని ఆరోపించారు. బాబు లాంటి మంచి ప్రజానాయకున్ని ప్రజాక్షేత్రంలో ఎదిరించలేక అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం మంచి విధానం కాదని అన్నారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ అలీ సాబ్, రాయిరాల వంశీ, మల్లయ్య, లక్ష్మీనారాయణ, శీను, గోవిందు, గోపయ్య, హుస్సేన్ ,మేడి శీను, పుట్ట సైదులు, తదితరులు పాల్గొన్నారు.