చండూరు, గట్టుప్పల మండల కేంద్రాలలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం టిడిపి మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్, బడుగుల లక్ష్మయ్య , ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేయాలని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గెలిపించుకోవాలని. అన్నారు పేద ప్రజల అండ తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి గడప గడప తిరుగుతూ పార్టీ సభ్యత్వ నమోదును భారీ స్థాయిలో చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు అడహక్ కమిటీ మెంబర్ ఎండి షరీఫ్, మండల అలహాక్ కమిటీ మెంబర్ అబ్బన బోయిన అంజయ్య యాదవ్ , పార్లమెంటు ఆడహక్ నెంబర్ శ్రీపతి రామ్ రెడ్డి , గంట అంజయ్య , అవ్వారి సుబ్బారావు, బోడ బిక్షమయ్య గౌడ్, సాపిడి నరసింహ, సాయం కనకయ్య, యాట వెంకటేశం, పాశం రఘుపతి, చిలువేరు రాజు, తడక కోటేశ్వర్, కృష్ణ తేజ, భూతరాజు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
గట్టుపల్ లోను..
గట్టుప్పల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ , సభ్యత్వ నమోదు కార్యక్రమం ,జెండా ఆవిష్కరణ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడుగు లక్ష్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గట్టుప్పల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య,ప్రధాన కార్యదర్శి ఎండి పాషా,గ్రామ శాఖ అధ్యక్షులు బొల్ల శంకరయ్య. ఉపాధ్యక్షులు సూరపల్లి నరసింహ, బొల్ల శ్రీకాంత్, రాజు, పెట్టుగల అంజయ్య.గుర్రం కొండయ్య, రాము, పెదగాని రాములు,బడుగు తిమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.