నవతెలంగాణ-హైదరాబాద్
బడుగు బలహీన వర్గాలు బీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలని టీడీపీ పిలుపునిచ్చింది. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి పేదవారికి రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా గహాలు కట్టించిన తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని తెలుగుదేశం జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు అధ్యక్షుడుగా ముంజ వెంకట రాజ్యం గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జన్మించిన రోజు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం గొప్ప పరిణామమన్నారు. 42 ఏండ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతులకే కాకుండా , వెలమ, రెడ్డి, వైశ్య, వారికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. అనాడు కాంగ్రెస్ పాలకులు ప్రధాన మంత్రి పర్యటనలో సీఎంను అవమానించిన ఘటనలు ఉన్నాయన్నారు. టీడీపీ హయాంలో ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజు నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు సంధ్యపోగు రాజశేఖర్, యం .బిక్షపతి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘం ప్రమాణం
టీడీపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ముంజ వెంకటరాజ్యం గౌడ్, ఉపాధ్యక్షులుగా పుల్లయ్య, అప్పారావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బాలరాజు, రాష్ట్ర కార్యదర్శిగా శ్రీదేవి, కోశాధికారి రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.