రెంజల్ మండలం బోర్గం పాఠశాల ఉపాధ్యాయులు ఈసంపల్లి గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందడం విద్యార్థుల బోధనకు తీవ్ర విగాథం ఏర్పడిందని పీఆర్ టీయూ మండల శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు అండగా నిలవాలని పీఆర్ టీయూ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్ ,సాయి రెడ్డిలు కోరారు. ఉపాధ్యాయుడు మృతి చెందడంతో బోర్గం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.