ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీయమ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి…

– జిల్లా అదనపు కలెక్టర్  వీరారెడ్డి … 
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నియమా నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి నోడల్ ఆఫీసర్లకు ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  నియమించిన నోడల్ అధికారులు తమ విధులు నియమ  నిబంధనలను పాటిస్తూ రోజువారి రిపోర్టులు సమయంలో పంపాలని కోరారు.  జిల్లాలో మొత్తం 985 ఓటర్లు ఉన్నందున వారు సకాలంలో వచి ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ కేంద్రాలకు అవసరమైన మెటీరియల్ ను సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేర్చాలని, 17 పోలింగ్ కేంద్రాలకు  6 రూట్ల ద్వారా 17 మండలాలకు  బ్యాలెట్ బాక్సులు పంపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు పంపే ముందల పరిశీలన చేయాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సంబంధిత నోడల్ అధికారులు, సూపరింటెండెంట్ లు రామారావు, శాంతి లాల్, డిటి సురేష్, ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.