ఉపాధ్యాయ బదిలీలు.. ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలి

ఉపాధ్యాయ బదిలీలు.. ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలి– సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విన్నపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన కలిసి విన్నవించారు. స్కూల్‌ అసిస్టెంటు పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేసిన పండిట్‌, పీఈటీ పోస్టుల ప్రమోషన్లపై షెడ్యూల్‌లోపు పూర్తిచేయాలని కోరారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యా యుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియపై ఉన్న కోర్టు ఆటం కాన్ని తొలగిం చాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ కోసం ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. భార్యాభర్తల బదిలీలు, కొత్త జిల్లాలలో సాన్థినిక బదిలీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాన్ని వర్తింపజేయాలని కోరారు.