విద్యార్థిని అభినందించిన ఉపాధ్యాయులు

నవ తెలంగాణ -నర్వ
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలు రాసిన వారిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థిని పెద్దింటి గాయత్రి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం మల్లేష్‌ తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థి గాయత్రికి పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మల్లేష్‌ మాట్లాడుతూ ప్రవేశ పరీ క్షలో మంచి మార్కులు తెచ్చుకున్న గాయత్రి మరికల్‌ గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.