మంచిప్ప గ్రామంలో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం

నవతెలంగాణ -మోపాల్

మంగళవారం రోజున  మోపాల్ మండలంలోని  మంచిప్ప గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను జై భారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జై భారత్ యూత్ అధ్యక్షులు సాయిరాం మాట్లాడుతూ అజ్ఞానం నుండి జ్ఞానని ప్రసాదించే వ్యక్తి ఉపాధ్యాయుడు అన్నారు.సర్పంచ్ సిద్ధార్థ మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత ఆచార్యుడు నిజమైన దేవుడు అని ఉపాధ్యాయుల వల్లనే మంచి మార్గ నిర్దేశం నేర్చుకుంటామని, అన్ని రంగాలలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని జీవితంలో అన్ని ఉద్యోగుల వారు రిటైర్మెంట్ అవుతారు కారు ఉపాధ్యాయులు ఏప్పటికీ రిటర్మెంట్ అనే పదం ఉండధనీ ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు నవీన్, మండల కో ఆప్షన్ మెంబర్  అజీమ్ , ఉప సర్పంచ్ జగదీష్ యాదవ్, గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్స్ కర్ల రవీందర్,గోవురు సాయిరెడ్డి,ఎఱ్ఱొల భూమయ్య ,వడ్ల నరేందర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల చారి ఉపాధ్యాయులు సాయిలు ,పిటి దేవేందర్ విద్యార్థులు పాల్గన్నారు