
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా బోధన్ అభ్యాసం చేయడం జరిగింది తదనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు వేడుక చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. బోధన్ అభ్యాసం చేసిన విద్యార్థులకు కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే చాలా పవిత్రమైనదని అన్ని వృత్తులు ఉపాధ్యాయ వృత్తితోనే ముడిపడి ఉంటుందని తాను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగు ఇచ్చేవాడే ఉపాధ్యాయుడు అని పేర్కొన్నాడు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ పాఠశాల ప్రిన్సిపాల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు