ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ- ఆర్మూర్
 పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో మంగళవారం ప్రభుత్వ ,,ప్రైవేటు పాఠశాలల యందు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవంను నిర్వహించినారు.పట్టణంలోని మామిడిపల్లి నలంద హై స్కూల్లో  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందాన్ని స్కూల్ యాజమాన్యం విద్యార్థుల చేతుల మీదుగా సన్మానించారు. విద్యార్థులు గురువుల గొప్పతనం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ప్రసాద్ , సాగర్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సరసం చిన్నారెడ్డి అధ్యక్షతన న్యాయమూర్తులు శ్రీమతి నసీం సుల్తానా,, వేముల దీపీలను సన్మానించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ ఆధ్వర్యంలో,, పట్టణంలోని విజయ్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత దివాకర్ పాల్గొనగా విద్యార్థిని విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.. గాంధీనగర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో యాజమాన్యం మానస గణేష్ ,పద్మ లను ఉపాధ్యాయ బృందం సన్మానించినారు.