సమాజంలో ఉపాధ్యాయులదే అత్యున్నత స్థానం

Teachers hold the highest position in the society– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
సమాజంలో ఉపాధ్యాయులదే అత్యున్నత స్థానమని, రేపటి బావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో వారి కృషి  అమోఘామని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి భాస్కరా ఫార్మసీ వ్యవస్థాపకులు భాస్కర్ యాదవ్ సహకారం అందించారు. మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, భాస్కరా ఫార్మసీ వ్యవస్థాపకులు భాస్కర్ యాదవ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేసిన కృషి ఫలితంగానే ఉన్నత స్థానాల్లోకి వెళుతున్నామన్నారు. అందరూ ఉత్తమ ఉపాధ్యాయులేనని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంలో అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు అభినందనీయులని అన్నారు. ఉపాధ్యాయుల సేవలను ఎప్పుడు మరువలేమని, ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులంతా విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అంతకుముందు  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రమటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి గంగాధర్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సన్మాన గ్రహీతలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.