విద్యా సంస్కరణ బిల్లును నిరసిస్తూ నేపాల్‌లో టీచర్ల ఆందోళన

Teachers protest in Nepal against education reform bill– మూతపడ్డ 29వేల ప్రభుత్వ పాఠశాలలు
ఖాట్మండు : విద్యా సంస్కరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేపాల్‌లో వేలాదిమంది ఉపాధ్యాయలు బుధవారం నుండి నిరసన కార్యాచరణకు దిగారు. ఖాట్మండులో టీచర్లు ప్రదర్శనలు నిర్వహించారు. రాజధానిలో మొత్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. పార్లమెంట్‌ భవనం నుండి కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు దారి తీసే ప్రధాన వీధిని దిగ్బంధిస్తూ టీచర్లు ప్రదర్శన నిర్వహించారు. దీంతో రాజధాని నట్టనడిబొడ్డున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వందలాదిమంది పోలీసులు ముళ్ళ కంచె వేసి రోడ్డును బ్లాక్‌ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలను స్థానిక నియంత్రణ కిందకు తీసుకురావాలన్నది బిల్లులో ఒక నిబంధనగా వుంది.