
రాజంపేట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు పై పై దాడికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినట్లు తెలిపారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.