నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తూరు (జంపంగవాయి) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్డుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తూరు ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలలను సందర్శించి పరిశీలించారు. అనంతరం పాఠశాల సమస్యలపై మండల మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తూరు(జంపంగ వాయి) గ్రామంలో విద్యార్థులు 30 మంది దాకా ఉంటే ఒక్కరే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేనందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే సాధ్యం కాదు అని, ఉపాధ్యాయులు లేకపోతే పేద మధ్య తరగతి విద్యార్థులు ఎలా చదువుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొత్తూరు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులు నియమించాలని, లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు బాలు, శివ తదితరులు పాల్గొన్నారు.