ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలినవతెలంగాణ-శంకర్‌పల్లి
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. శంకర్‌పల్ల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్లు అదేవిధంగా పిల్లిగుండ్ల గ్రామంలోని నర్సరీలను తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించారు. జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో 9 మంది ఉపాధ్యాయులకు గాను ఐదు మంది సెలవు పెట్టడం జరిగిందని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో భోజనాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. పిల్లి గుండ్లలో నర్సరీ మొక్కలు ఏపుగా పెరిగాయని ఎప్పటికప్పుడు నర్సరీ మొక్కలను ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.