ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి: హెచ్ఎం విజయ్ కుమార్ 

Teachers must be punctual: HM Vijay Kumarనవతెలంగాణ – పెద్దవంగర
ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటించాలని చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఎర్రోజు విజయ్ కుమార్ అన్నారు. గురువారం చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ఉపాధ్యాయులు నిరంతర మూల్యంకనాన్ని చేపట్టి, విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపర్చాలని అన్నారు. ప్రతి విద్యార్థి హాజరును ‘ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్‌)తో నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్‌ మొబైల్‌, ట్యాబ్‌ల ద్వారా విద్యార్థుల ముఖాలను స్కాన్‌ చేస్తేనే హాజరు నమోదు అవుతుందని చెప్పారు. తద్వారా బోగస్ హాజరు నమోదును అరికట్టేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రతి మూడవ శనివారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, యాప్ లో నమోదు చేయాలన్నారు. సెలవుల కోసం ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ రాయాలని, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలను నిర్వహించాలని హెచ్ఎం లకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం లు కస్తూరి నరేష్, చిక్కాల సతీష్, సోమారపు ఐలయ్య, రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వాణి, మహబూబి, లక్ష్మయ్య, దేవదాస్, రవికుమార్, బాలరాజు, సీఆర్పీ వేముల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.