– ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు
– నిరుద్యోగులకు న్యాయం చేయాలి
– తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం
నవతెలంగాణ-మంచాల
క్యాడర్ స్ట్రెంత్‌కు వ్యతిరేకంగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులను తిరిగి పంపించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఓ 2018 రాష్ట్ర పతి ఉత్తర్వుల మే రకు జీఓ. ఎంఎస్ నంబర్ 317 ప్రకారం నూతన జిల్లాలకు ఉపాధ్యా యు ల కేటాయింపులో భాగంగా రంగా రెడ్డి జిల్లాకు క్యాడర్ స్ట్రెంతుకు మించి వివిధ కారణాలతో అనగా 317 అప్పిల్స్ స్పోజ్ కేసులు అంతర్ జిల్లా బది లీల ద్వార సుమారు 400 మంది ఉపాధ్యాయులు క్యాడర్ స్ట్రెంత్‌కు భి న్నంగా వచ్చిందని, దీని ఫలితంగా జిల్లాలో స్థానిక ఉపాధ్యాయులకు పదోన్నతులో తీవ్రనష్టం జరిగిందనీ, అంతేగాక స్థానిక నిరుద్యోగులకు గండి పడిందని అన్నారు. జిల్లాకు వచ్చిన అదనపు ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వమని జిల్లా విద్యాధికారిని కోరినప్పటికీ వివిధ రకాలైన అసం బంధమైన కారణాలు చూపిస్తూ న్యాయస్థానాలకు సైతం సరైన సమా చారం ఇవ్వని కారణంగా నేడు ప్రస్తుతం జరిగే రాష్ట్ర వ్యాప్త పదోన్న తులు బదిలీల్లో రంగా రెడ్డి జిల్లాను మినహాయింపును ఇస్తూ ఉత్తర్వులు వచ్చా యనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో ఉందన్నారు. డీఈఓ ఇస్తున్న ఎక్సెస్ డాటా వాస్తవ డాటాకు పొంతన లేకుండా ఉందన్నారు. కాబట్టి క్యాడర్ స్ట్రెంతుకు వ్యతిరేకంగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులను తిరిగి పంపిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సం ఘాల ఐక్య వేదిక నాయకులు రమేష్, ఎస్.రాజీ రెడ్డి, ఎం.రాములు, వి. సీతారాం, బాలునాయక్, ఎస్‌కే.జహీర్, ఎండి.గఫూర్, డి.శ్రీనివాస్, ఆర్. రాజమల్లేష్, ఎం.పాండు, ఎన్.శ్రీనువాస్, బాల్‌రాజ్, వెంకటేష్ తది తరులు ఉన్నారు.