
తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలి సర్వస్వం కోల్పోయిన గోల్కొండ పోచమల్లు కుటుంబాన్ని ఆదుకోవడానికి దండేపల్లి మండలం తాళ్లపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మంగళవారం ₹5వేలు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఇటీవల దుబాయిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కూకటికారి రమేష్ కుటుంబానికి అండగా ఉండడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాళ్లపేట ఉపాధ్యాయ సిబ్బంది ₹5వేలు, ఆంగ్ల ఉపాధ్యాయురాలు రుక్మిణి తన వంతు సహాయంగా వ్యక్తిగతంగా ₹ 5 వేలు అందించారు. ఇరు కుటుంబాలకు చెందిన విద్యార్థులు గోల్కొండ చరణ్, కూకటికారి కౌశిక్ తాళ్లపేట ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరంగి సుదర్శన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.