టెక్ మహీంద్రా,సైన్స్ అకాడమీ హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహించిన మాస్టర్ ట్రైనర్ ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ సెర్మని హైదరాబాద్ లోని సాలర్ జంగ్ మ్యూజియం లో జరగగా ఏర్గట్ల ప్రభుత్వ పాఠశాల,నిజామాబాద్ దుబ్బ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులు గాండ్ల రాజశేఖర్ , చల్లా ముద్దుకృష్ణ లు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ కోర్సులో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 10 మంది ఫిజికల్ సైన్స్,18 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొన్నారని,ఈ సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు.