ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతా..

Struggle for solving the problems of teachers and teachers.– పూల రవీందర్ జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థి
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఉపాధ్యాయ అధ్యాపకుల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడారు. సి పి ఎస్, 317 జీవో బాధితులకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాను.శాసన మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు సరిగా ప్రాతినిధ్యం జరగక పోవడం బాధాకరం అన్నారు. శాసన మండలిలో ఉపాధ్యా యులు, అధ్యాపకుల సమస్యలు సరిగా ప్రాతినిధ్యం జరగడం లేదని, ఫలితంగా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని జక్టో మరియు అధ్యాపక, ఆచార్య సంఘాల ఎం.ఎల్.సి అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. గతంలో శాసన మండలి సభ్యునిగా పనిచేసిన కాలంలో అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయి పరిష్కరించగలి గానని, ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 61 సం॥ లకు పెంపు, మొదటి తెలంగాణ పి ఆర్ సి లో 30% ఫిట్మెంట్ సాధన, సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ సాధించడం, కేజీబీవీ ఉపాధ్యాయినిలకు 180 రోజుల మెటర్నిటీ సెలవు సౌకర్యం వంటివి సాధించి పెట్టగలిగానని తెలిపారు.గత ఎం.ఎల్.సి ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ 6 సం॥లుగా ఉద్యోగ,ఉపాధ్యాయ అధ్యాపక సమాజంలోనే వుంటూ వారి పోరాటాలకు మద్దతుగా నిలిచానని, ఎప్పటికప్పుడు వారి సమస్యలు ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేసానని తెలిపారు.ఫిబ్రవరి లో జరుగబోయే ఎం ఎల్ సి ఎన్నికలలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎం ఎల్ సి ఉపాధ్యాయ,అధ్యాపక మిత్రులందరూ మొదటి పాదాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు భవిష్యత్ లో ఏర్పడే ఖాలీలలో స్థానికత ఆధారంగా బదిలీ చేయటానికి ప్రభుతాన్ని ఒప్పిస్తానని దీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, జిల్లా అధ్యక్షులు సిరుప సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి పోరిక శంకర్, గోవిందరావుపేట మండల అధ్యక్షులు బానోత్ విజయ్, తాడ్వాయి మండల అధ్యక్షులు కందిక రాజు తదితరులు పాల్గొన్నారు