నూతన విద్యా విధానం ద్వారా నవోదయలో బోధన.!

Teaching in Navodaya through new education system.నవతెలంగాణ – పెద్దవూర
విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, వారిని చైతన్యవంతులను చేయడానికి, ఉన్నతమైన స్థితికి ఎదిగేలా చేయడానికి గాను నూతన విద్యావిధానం ద్వారా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు నవోదయ పాఠశాలలోనూతన విద్యావిధానం ద్వారా బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయులు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి, మహాత్మాగాంధీ కలలను నెరవేర్చడానికి, మోడీ స్వప్నాన్ని సాకారం చేయడానికి గాను నవోదయ విద్యాలయ సమితి న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ వారి చేత విద్యాలయములో గత రెండు రోజులుగా అద్భుతమైన గాన కచేరి నిర్వహిస్తున్నారు. అందులో శ్రీవిద్య అద్భుతమైన గాత్రముతో సంత్ మీరాబాయి 525 వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీరా భజన్ ద్వారా శ్రీకృష్ణుని లీలామృతాన్ని మా విద్యార్థులకు అధ్యాపకులందరికీ అందించి ఆనందింపజేశారు. విద్యార్థులకు చదువుతోపాటుగా బొమ్మలు వేయడం, సంగీతములో ప్రావీణ్యాన్ని కలిగించడము ,ఆటలలో నైపుణ్యాన్ని కలిగించడము లాంటి ఎన్నో ఉత్తమమైన విలువైన విద్యలను వారికి అందించడం జరుగుతుంది. అందుకే ఈ విద్యాలయాలను జిల్లాకే ప్రామాణిక విద్యాలయాలుగా (మోడల్ స్కూలుగా) పరిగణించడం మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి విద్యాలయాలకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చైర్మన్ గా కూడా వ్యవహరించి మార్గదర్శనం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సంగీత నాటక అకాడమీ వైపు నుండి సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని విద్యాలయానికి అందించినందుకు విద్యాలయ ప్రస్తుత ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత వారిని అభినందించారు. కళాకారులు మరియు ఆర్గనైజర్ విద్యాలయాన్ని అధ్యాపకుల, విద్యార్థుల స్థితిగతులను ,వసతులను గమనించి ప్రశంసించారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలను మునుముందు కూడా మాకు అందించి మా పిల్లలను చైతన్యవంతులను చేయాలని కోరుకున్నారు.