– రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో చివరి టెస్ట్
కాన్పూర్: బంగ్లాదేశ్ జరిగిన తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. కొత్త ప్రయోగాలకు తెరలేపకుండా తొలి టెస్ట్‌లో ఆడిన జట్టుతోనే రెండోటెస్ట్ బరిలోకి దిగాలని యోచిస్తోంది. బంగ్లాతో తొలిటెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జైస్వాల్, శుభ్‌మన్‌కి తోడు, అశ్విన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. చెన్నై టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఆరు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబరు 27న ప్రారంభమయ్యే రెండో టెస్టులో అశ్విన్ మరో రికార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐసిసి ప్రకటించిన తాజా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లాపై అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 199 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు.
కెఎల్ రాహుల్‌ను ఆకాశానికి ఎత్తిన ఫీల్డింగ్ కోచ్
టీమిండియా ఫీల్డర్లలో కెఎల్ రాహుల్ అద్భుతమని ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ పేర్కొన్నాడు. భారత మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను మార్క్‌వాతో పోల్చుతూ ఆకాశానికి ఎత్తేశాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ప్రమాదకరమైన బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. కేఎల్ వద్ద అద్భుతమైన టెక్నిక్ ఉందని.. మార్క్‌వా కూడా గతంలో ఇలాంటి స్ట్రాటజీనే పాటించేవాడని దిలీప్ పేర్కొన్నాడు. స్లిప్‌లోనే కాకుండా.. మిడాన్ ఫీల్డింగ్‌లోనూ కేఎల్ రాహుల్ చురుగ్గా ఉంటాడు. క్యాచ్‌ల కోసం అతడు చూపించిన విధానం అద్భుతం. బంతి కింద పడకుండా తన వేళ్లను ఎలా ఉపయోగించాలనే దానిపై పూర్తి అవగాహన ఉండాలి. మైదానంలో సరైన సమయంలో ఆచరించాలి. కేఎల్ రాహుల్ ఎత్తుగా ఉండే ప్లేయర్. అలాంటి వ్యక్తి క్యాచ్‌ను అందుకోవడం తేలికైన విషయమేం కాదు” అని దిలీప్ వ్యాఖ్యానించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన 13వ ఓవర్‌లో ముష్ఫికర్ రహీమ్ (8) ఆడిన బంతిని రెండో స్లిప్‌లో ఉన్న కేఎల్ రెండు చేతులతో అందుకొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ మిడాన్‌లో ఒడిసిపట్టాడు. ఈసారి అశ్విన్ బౌలర్.