స్కట్‌ దెబ్బకు టీమిండియా విల విల

Team India suffered a blow– తొలి వన్డేలో ఆసీస్‌ మహిళల చేతిలో హర్మన్‌ సేన చిత్తు
బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలివన్డే టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అలెన్‌ బోర్డర్‌ స్టేడియంలో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 100 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ కూడా తడబాటకు గురైంది. టార్గెట్‌ 101 పరుగులే కావడంతో.. వికెట్లు పడినా ఆసీస్‌ ఇబ్బంది పడలేదు. కేవలం 16.2 ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయి ఆసీస్‌ విజయం సాధించింది. ఓపెనర్లు జార్జియా వోల్‌ (46), ఫోబ్‌ లిట్చ్‌ఫీల్డ్‌ (35) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్‌ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతోన్న ఆసీస్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ (5/19) ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్‌ బ్యాటర్లను బెంబేలెత్తించింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్‌ (23) టాప్‌ స్కోరర్‌. ఆమెతోపాటు హర్లీన్‌ డియోల్‌ (19), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (17), రిచా ఘోష్‌ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఓపెనర్లు ప్రియా పునియా 3, స్మతీ మంధాన 8, దీప్తి శర్మ 1, సైమా ఠాకూర్‌ 4, టిటాస్‌ సధు 2 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో స్కట్‌ 5 వికెట్లు.. కిమ్‌ గార్త్‌, గార్డెనర్‌, సదర్లాండ్‌, అలానా కింగ్‌ తలో వికెట్‌ తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్కట్‌కు దక్కింది. రెండో వన్డే ఆదివారం(8న) జరగనుంది.
స్కోర్‌బోర్డు…
ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: ప్రియ పూనియా (సి)గార్డినర్‌ (బి)స్కట్‌ 3, స్మృతి మంధాన (సి)మూనీ (బి)స్కట్‌ 8, హర్లిన్‌ (సి)సథర్లాండ్‌ (బి)గార్డినర్‌ 19, హర్మన్‌ప్రీత్‌ (ఎల్‌బి)సథర్లాండ్‌ 17, రోడ్రిగ్స్‌ (బి)కిమ్‌ గార్త్‌ 23, రీచా ఘోష్‌ (సి)కిమ్‌ గార్త్‌ (బి)స్కట్‌ 14, దీప్తి శర్మ (రనౌట్‌)వారేహామ్‌ 1, సైమా ఠాకూర్‌ (సి)లిచ్‌ఫీల్డ్‌ (బి)స్కట్‌ 4, టిటాస్‌ సద్ధు (సి)లిచ్‌ఫీల్డ్‌ (బి)కింగ్‌ 2, ప్రియా మిశ్రా (బి)స్కట్‌ 0, రేణుక (నాటౌట్‌) 0, అదనం 9. (34.2ఓవర్లలో ఆలౌట్‌) 100పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/19, 3/42, 4/62, 5/89, 6/92, 7/97, 8/100, 9/100, 10/100
బౌలింగ్‌: స్కట్‌ 6.2-1-19-5, కిమ్‌ గార్త్‌ 8-1-20-1, ఎలీసా పెర్రీ 3-0-13-0, గార్డినర్‌ 7-0-14-1, సథర్లాండ్‌ 5-0-13-1, కింగ్‌ 5-1-18-1.
ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్‌: లిచ్‌ఫీల్డ్‌ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)రేణుక 35, జార్జియా వాల్‌ (నాటౌట్‌) 46, ఎలీసా ఫెర్రీ (సి)రీచా (బి)రేణుక 1, బెత్‌ మూనీ (సి)రోడ్రిగ్స్‌ (బి)రేణుక 1, సథర్లాండ్‌ (సి)మంధాన (బి)ప్రియా మిశ్రా 6, గార్డినర్‌ (స్టంప్‌)రీచా (బి)ప్రియా మిశ్రా 8, మెక్‌ గ్రాత్‌ (నాటౌట్‌) 4, అదనం 1. (16.2ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 102పరుగులు.
వికెట్ల పతనం: 1/48, 2/50, 3/52, 4/77, 5/97
బౌలింగ్‌: రేణుక 7-0-45-3, సైమా ఠాకూర్‌ 3-0-18-0, టిటాస్‌ సద్ధు 4.2-0-27-0, ప్రియా మిశ్రా 2-0-11-2.