కంటతడి పెట్టిన తుల ఉమ

Teardrop Libra– చివరి నిమిషంలో బీజేపీ వేములవాడ అభ్యర్థి మార్పు
నవతెలంగాణ – వేములవాడ
బీజేపీలో వేములవాడ నియోజకవర్గం టికెట్‌ విషయంలో తుల ఉమకు అధిష్టానం హ్యాండిచ్చింది. నామినేషన్‌కు చివరి నిమిషంలో ఆమెకు కాకుండా బీఫామ్‌ మరొకరికి ఇచ్చింది. ఆ పార్టీ నాలుగో జాబితాలో తుల ఉమకు వేములవాడ నియోజకవర్గం టికెట్‌ కేటాయించడటంతో.. బీజేపీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు, వేములవాడ మండల అధ్యక్షులు వికాస్‌ మూడు రోజులు రాష్ట్ర కార్యాలయంలో నిరసనకు దిగారు. దాంతో అధిష్టానం వికాస్‌కు బీఫామ్‌ ఇచ్చింది. అయితే, తుల ఉమ శుక్రవారం నామినేషన్‌ వేశారు. బీఫామ్‌ మాత్రం వికాస్‌కు ఇవ్వడంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తుల ఉమ మీడియా ముందు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ బీసీ నినాదాన్ని తుంగలో తొక్కి.. డబ్బులు సంచులతో వచ్చే దొరలకు టికెట్‌ కేటాయించిందని విమర్శించారు. తాను కచ్చితంగా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.