సాగునీటి కోసం రైతుల కన్నీటి కష్టాలు

 – ఎస్సారెస్పీ నీటి విడుదల జాప్యంతో ఎండుతున్న వరి పొలాలు
 నవతెలంగాణ – నూతనకల్
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి చేసినప్పటికీ అతి దగ్గరగా ఉన్నా.. నూతనకల్ మండలానికి సాగునీరు అందక రైతులు అనేక అష్ట కష్టాల పాలవుతున్నారు. వార బంది మాదిరిగా నీటిని విడుదల చేస్తున్న నీటి శాఖ అధికారులు నీరును అధిక మోతాదులో విడుదల చేయకపోవడంతో, మండలంలోని అన్ని గ్రామాల చెరువులకు అందక భూగర్భ జలాలు అడుగంటి, బావులు ఎండిపోయి, బోర్లు నీళ్లు సరిగ్గా రాక, వందల ఎకరాలు వరి ఎండిపోయి పశువుల పాలైతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేటుకు అడ్డంగా ఉన్న చెత్తను తొలగిస్తున్న రైతులు, ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీరు తుంగతుర్తి మండల పరిధిలోని జలాల్పురం వద్ద 69 డీపీఎం వద్ద కాలువ గేటుకు అడ్డంగా ఉన్న సర్కారు ,ముళ్ళ చెట్లు ,కంప చెట్లు ను తొలగించుతున్నారు . 22 /6 కాలువలకు నీటి సరఫరా కాక పొలాలు ఎండడంతో పరిధిలోని చీల్పకుంట్ల గ్రామానికి చెందిన రైతులు ఆక్కడికి చేరుకొని స్వయంగా కంప చెట్లను తొలగించారు ఎండుతున్న పొలాలను చూసి సాగునీటి కోసం కష్టపడుతున్నామని ఇకనైనా అధికారులు స్పందించి విడుదల చేయాలని కోరుతున్నారు,, ఎస్సారెస్పీ అధికారులు నేటి సరఫరా ఆటంకాలను తొలగించాలి,,, ఎస్సారెస్పీ కాలువలు పారుతున్న నీటికి అడ్డంగా ఉన్న కంపచట్లను మట్టి దుప్పలను అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కూసు గోపాల్ అధికారులను డిమాండ్ చేశారు,,,,పైన రిజర్వాయర్ లో పూర్తి సామర్ధ్యం స్థాయిలో నీరు లేనందు వల్ల కాలువ చివరి వరకు నీరు పూర్తి స్థాయిలో అందటం లేదు,నీటిని కాలువ చివరి వరకు సరఫరా కోసం కృషి చేస్తాం అని ఎస్సారెస్పీ డీఈ తెలిపారు DBM 69కు కాలువకు నీటిని నేడు  విడుదల చేశామని అట్టీ నీటి ని  సద్వినియోగం చేసుకోవాలి అని మరియు కాలవలో అడ్డుకట్ట లు వేయకూడదని తెలిపారు.