ఘనంగా క.. టీజర్‌ విడుదల

The release of the teaser by kaహీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ సినిమా ‘క’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర టీజర్‌ రిలీజ్‌ లాంచ్‌ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ‘మూడు ‘క’ లను నమ్ముకుని ఈ సినిమా నిర్మించాను. అందులో మొదటి క.. కథ. చాలా కథలు విన్న తర్వాత ఈ సినిమా కథలో డిఫరెన్స్‌, కంటెంట్‌ ఉన్నాయని బలంగా అనిపించింది. రెండో క.. కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. మూడో క.. కల. ఇండిస్టీలో ఒక మంచి సినిమా నిర్మించి పది మందికి తోడుగా ఉండాలని, ఇండిస్టీకి ఉపయోగపడాలని సంకల్పించుకున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతున్న దర్శకులు సందీప్‌, సుజీత్‌ మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంటారు’ అని తెలిపారు. ‘మా ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ మరువలేనిది. ఏ కథనైనా తెరపైకి తీసుకొచ్చేందుకు ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది కిరణ్‌. టీజర్‌ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం’ అని దర్శకులు అన్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ”’క” సినిమా తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని మీరంతా చెప్పుకుంటారు. ఇప్పుడున్న టికెట్‌ రేట్స్‌, పోటీలో ఎంతమంచి సినిమా ఇస్తే ఆడియెన్స్‌ థియేటర్స్‌కు వస్తారు అనేది మా డైరెక్టర్స్‌ బాగా ఆలోచించారు. ఇవాళ మా టీమ్‌ అంతా హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే కారణం మా ప్రొడ్యూసర్‌ గోపాలకృష్ణ రెడ్డి’ అని చెప్పారు.